కుమార్ సాను సంచలన నిర్ణయం! తన ముగ్గురు పిల్లల తల్లిపై 50 కోట్ల పరువు నష్టం దావా
December 22, 2025

ప్రముఖ గాయకుడు కుమార్ సాను మరియు ఆయన మాజీ భార్య రీటా భట్టాచార్య మధ్య వివాదం ముదిరి కోర్టు మెట్లెక్కింది. రీటా చేసిన ఆరోపణలకు ప్రతిగా, సాను పరువు నష్టం దావా వేశారు. అయితే మొదట 30 లక్షలు అని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి తన నుండి 50 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ సాను నోటీసులు పంపారని రీటా ఆరోపించారు. తన ముగ్గురు పిల్లల తల్లిపై ఇన్ని కోట్ల రూపాయల దావా వేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో రీటా మాట్లాడుతూ, తాను గర్భిణిగా ఉన్న సమయంలో సాను కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేసిందని, కనీసం ఆహారం మరియు వైద్యం కూడా అందించలేదని ఆరోపించారు. కోర్టులో కుమార్ సానును కలిసినప్పుడు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తమను వేధించవద్దని కోరతానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ 50 కోట్ల పరువు నష్టం దావా విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.