ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులపై హెడ్ మాస్టర్ అకృత్యాలు
December 18, 2025

బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆరో తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు సంజయ్ కుమార్ మసాజ్ చేయించుకునే నెపంతో బాలికలను తన గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే వారిని శిక్షించడమే కాకుండా బెదిరింపులకు గురిచేసేవాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.