ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ ఇస్తూ బీజేపీలో చేరనున్న ప్రజ్ఞా సతవ్

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ ఇస్తూ బీజేపీలో చేరనున్న ప్రజ్ఞా సతవ్

దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సతవ్ భార్య మరియు ఎమ్మెల్సీ ప్రజ్ఞా సతవ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్టీలోని అంతర్గత విభేదాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె, గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.

రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన రాజీవ్ సతవ్ మరణం తర్వాత కాంగ్రెస్ ప్రజ్ఞాను రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమె పదవీకాలం 2030 వరకు ఉన్నప్పటికీ, కీలక ఎన్నికలకు ముందు ఆమె పార్టీ మారడం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *