చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన మాధురీ దీక్షిత్ తన నిర్ణయంపై క్లారిటీ
December 18, 2025

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ‘మిసెస్ దేశ్‌పాండే’ అనే థ్రిల్లర్ సిరీస్‌తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు సినిమాల సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం అని స్పష్టం చేశారు. నటిగా తనకు సంతృప్తినిచ్చే మరియు ప్రతిరోజూ కొత్త ఉత్సాహాన్నిచ్చే పాత్రలనే తాను ఎంచుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.
దర్శకుడు నాగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మాధురి ఒక సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి బలమైన కథ, ప్రతిభ గల దర్శకుడు అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ విభిన్నమైన థ్రిల్లర్ సిరీస్ డిసెంబర్ 19 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.