ప్రైవేట్ ప్రదేశాల్లో కుల దూషణ నేరం కాదు హైకోర్టు సంచలన తీర్పు
December 18, 2025

షోరూమ్ లోపల లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో కుల దూషణలు చేయడం ఎస్సీ-ఎస్టీ చట్టం కింద నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని బహిరంగంగా, అందరి సమక్షంలో అవమానించినప్పుడు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ৩১ ఏళ్ల నాటి కేసులో నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్ వ్యూ’ అంటే సాధారణ ప్రజలు చూసేలా లేదా వినేలా ఉండాలని జస్టిస్ వివరించారు.
১৯৯৪లో వాహన రుణ చెల్లింపు వివాదంలో షోరూమ్ లోపల జరిగిన ఘర్షణపై ఈ కేసు నమోదైంది. కింది కోర్టు నిందితుడిని దోషిగా తేల్చినప్పటికీ, హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఆ సమయంలో అక్కడ స్వతంత్ర సాక్షులు ఎవరూ లేకపోవడం మరియు ఘటన మూసి ఉన్న షోరూమ్‌లో జరగడంతో ఇది బహిరంగ అవమానం కిందకు రాదని కోర్టు తేల్చిచెప్పింది.