మెస్సీ వివాదంలో పోలీసుల దూకుడు సీసీటీవీ కెమెరాల ఆధారంగా మరొకరి అరెస్ట్
December 17, 2025

యువ భారతి క్రీడాంగణంలో జరిగిన గొడవకు సంబంధించి బిధానగర్ సౌత్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ధాపాకు చెందిన రూపక్ మండల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ ఘటనలో అంతకుముందే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అల్లర్లకు పాల్పడిన ప్రతి ఒక్కరిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.