యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం 13 మంది సజీవ దహనం
December 17, 2025

మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన వరుస వాహనాల ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని తనిఖీ చేయడానికి ప్రయాణికులు కిందకు దిగగా, వెనుక నుంచి వచ్చిన బస్సులు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు.
ప్రమాద ధాటికి తొమ్మిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. పొగమంచు ఎక్కువగా ఉన్నా వాహనాలను అనుమతించిన అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు.