35 ఏళ్లుగా కడుపులో శిశువు! రాయిలా మారిందనే విషయం తెలిసి షాకైన తల్లి

35 ఏళ్లుగా కడుపులో శిశువు! రాయిలా మారిందనే విషయం తెలిసి షాకైన తల్లి

అల్జీరియాలో 73 ఏళ్ల వృద్ధురాలి కడుపులో 35 ఏళ్లుగా శిశువు శిలగా మారి ఉంది. ఈ అరుదైన వైద్య పరిస్థితిని ‘లిథోపీడియన్’ అని అంటారు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. సుమారు 2 కిలోల బరువున్న ఆ శిశువు రాయిలా గట్టిపడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ అరుదైన పరిస్థితి గర్భాశయంలో కాకుండా కడుపులో శిశువు పెరిగినప్పుడు సంభవిస్తుంది. రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల శిశువు ఎదుగుదల ఆగిపోయి, అది క్రమంగా రాయిలా మారుతుందని వైద్యులు తెలిపారు.

గతంలో కూడా ఆమెకు అప్పుడప్పుడు కడుపు నొప్పి ఉండేది, కానీ వైద్యులు దాని కారణాన్ని గుర్తించలేకపోయారు. ఇటీవల నొప్పి తీవ్రంగా ఉండటంతో, నిశితమైన పరీక్షలు నిర్వహించగా ఈ వింతైన కేసు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేకుండా ఇంత సుదీర్ఘ కాలం పాటు ‘శిశువు రాయి’ కడుపులో ఉండటం వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *