2025లో భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశంగా సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సంచలన నివేదిక

2025 సంవత్సరంలో అమెరికా కంటే సౌదీ అరేబియా నుండే అత్యధిక సంఖ్యలో భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం, సుమారు 11 వేల మందికి పైగా భారతీయులను సౌదీ స్వదేశానికి పంపించివేసింది. వీసా నిబంధనల ఉల్లంఘన, నివాస అనుమతి (ఇకామా) గడువు ముగియడం మరియు పని అనుమతులు లేకపోవడం వంటి కారణాలే ఇందుకు ప్రధాన కారణం. గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా నిర్మాణ రంగం మరియు గృహ పనుల్లో భారీ సంఖ్యలో భారతీయులు ఉండటం, అక్కడి స్థానిక చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
కేవలం సౌదీ మాత్రమే కాకుండా రష్యా, బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా భారతీయ విద్యార్థులను, కార్మికులను బహిష్కరించాయి. రష్యా నుండి 82 మంది విద్యార్థులు వెనక్కి రాగా, మయన్మార్ మరియు కంబోడియాలో సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకున్న భారతీయులు కూడా బహిష్కరణను ఎదుర్కొన్నారు. అయితే 2025లో భారతీయ వలసదారుల బహిష్కరణ విషయంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఏజెంట్ల మోసాలు మరియు వీసా నిబంధనలపై అవగాహన లేకపోవడమే ఈ భారీ బహిష్కరణలకు మూలకారణంగా విదేశాంగ శాఖ విశ్లేషించింది.