10 నెలల కోమా తర్వాత కళ్లు తెరిచిన మహిళ ఒడిలో ఊహించని అద్భుతం

10 నెలల కోమా తర్వాత కళ్లు తెరిచిన మహిళ ఒడిలో ఊహించని అద్భుతం

ఇటలీకి చెందిన 37 ఏళ్ల క్రిస్టినా రోసీ గత ఏడాది జూలైలో గుండెపోటుతో 10 నెలల పాటు కోమాలోకి వెళ్లిపోయారు. కోమాలోకి వెళ్లే సమయానికే ఆమె గర్భవతి కావడంతో, ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడే వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. తాజాగా కోమా నుండి స్పృహలోకి వచ్చిన క్రిస్టినాకు, తను అప్పటికే ఒక బిడ్డకు తల్లి అయ్యాననే విషయం తెలిసి ఆశ్చర్యంతో పాటు ఎనలేని ఆనందానికి గురయ్యారు.

భార్య ప్రాణాలతో తిరిగి రావడం పట్ల ఆమె భర్త గాబ్రియేల్ సుసీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్రిస్టినా ఒక ప్రైవేట్ క్లినిక్‌లో ఫిజియోథెరపీ చికిత్స పొందుతున్నారని, కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని ఆయన తెలిపారు. చికిత్స ఖర్చుల కోసం వారు విరాళాలు సేకరిస్తున్నారు. 10 నెలల పోరాటం తర్వాత తన బిడ్డను చూసుకున్న క్రిస్టినా ఉదంతం చూసి, ఇది ఆమెకు పునర్జన్మ వంటిదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *