హెయిర్ స్ట్రెయిటెనింగ్‌తో కిడ్నీలు ఫెయిల్ అందం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువతి

హెయిర్ స్ట్రెయిటెనింగ్‌తో కిడ్నీలు ఫెయిల్ అందం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువతి

జుట్టును అందంగా మార్చుకోవాలనే ప్రయత్నం ఒక 17 ఏళ్ల యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇజ్రాయెల్‌లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకున్న తర్వాత ఒక యువతి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా, ఆమె కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ చికిత్సలో వాడే ప్రమాదకర రసాయనాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించినట్లు షారే జెడెక్ మెడికల్ సెంటర్ నివేదిక వెల్లడించింది.

పరిశోధనల ప్రకారం హెయిర్ ప్రోడక్ట్స్‌లో ఉండే ‘గ్లైఆక్సిలిక్ యాసిడ్’ అనే రసాయనం శరీరంలోకి ప్రవేశించి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి రసాయన ఉత్పత్తులను నేరుగా స్కాల్ప్‌కు తగలకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు చికిత్సల సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *