స్కూల్ వాష్‌రూమ్‌లో సహచర విద్యార్థుల ఘాతుకం ఎనిమిదో తరగతి బాలుడిపై దారుణ దాడి

స్కూల్ వాష్‌రూమ్‌లో సహచర విద్యార్థుల ఘాతుకం ఎనిమిదో తరగతి బాలుడిపై దారుణ దాడి

కర్ణాటకలోని ఒక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడిపై ముగ్గురు సహచర విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. క్లాస్ లీడర్‌గా ఉన్నాడన్న నెపంతో నాలుగో తరగతి నుంచే ఆ బాలుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలుడిని బలవంతంగా వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. గతంలో కూడా సదరు బాలుడిని డబ్బులు, మొబైల్ ఫోన్లు తీసుకురావాలని బెదిరించి వేధించేవారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై జయలక్ష్మీపురం పోలీసులు ఐపీసీ మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా మొదట పోలీసులు స్పందించలేదని, బంధువుల ఒత్తిడితోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాలుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *