మద్యానికి బానిసయ్యాడని కన్నకొడుకు ప్రాణం తీయించిన తల్లి, 6 లక్షల సుపారీతో ఘాతుకం

మద్యానికి బానిసయ్యాడని కన్నకొడుకు ప్రాణం తీయించిన తల్లి, 6 లక్షల సుపారీతో ఘాతుకం

ఆంధ్రప్రదేశ్‌లో కన్నతల్లి తన కుమారుడిని చంపించేందుకు సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మద్యం అలవాటు ఉన్న 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి జయప్రకాశ్ రెడ్డి డబ్బుల కోసం నిరంతరం వేధిస్తుండటంతో, తల్లి శ్యామల ఈ దారుణానికి ఒడిగట్టింది. తన కొడుకును హతమార్చడానికి మహేష్ అనే వ్యక్తితో 6 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని, 50 వేల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించింది.

నవంబర్ 7న ముంబై-చెన్నై హైవే పక్కన జయప్రకాశ్ మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కాల్ డేటాను విశ్లేషించగా అసలు విషయం బయటపడింది. ఇన్ స్పెక్టర్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు తల్లి శ్యామల, ప్రధాన నిందితుడు మహేష్‌తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *