సొంత కూతురిని 24 ఏళ్లు బేస్‌మెంట్‌లో బంధించి ఏడుగురు పిల్లలకు తండ్రి అయిన కిరాతకుడు

సొంత కూతురిని 24 ఏళ్లు బేస్‌మెంట్‌లో బంధించి ఏడుగురు పిల్లలకు తండ్రి అయిన కిరాతకుడు

ఆస్ట్రియాలోని అమ్‌స్టెట్టెన్‌లో జోసెఫ్ ఫ్రిట్జల్ అనే వ్యక్తి తన 18 ఏళ్ల కుమార్తె ఎలిజబెత్‌ను సుమారు 24 ఏళ్ల పాటు ఇంటి కింద ఉన్న నేలమాళిగలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ కాలంలో ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడటంతో ఎలిజబెత్ ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో ఆమె పెద్ద కుమార్తె అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

తన కూతురు ఏదో మత సంస్థలో చేరి పారిపోయిందని జోసెఫ్ అందరినీ నమ్మించాడు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో జోసెఫ్‌కు జీవితఖైదు పడింది. ప్రస్తుతం ఎలిజబెత్ తన పిల్లలతో కలిసి ఒక రహస్య ప్రాంతంలో జీవిస్తోంది. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *