షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో యూనస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో యూనస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

ఇంక్లాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య నిందితులు భారతదేశానికి పారిపోయారన్న బంగ్లాదేశ్ పోలీసుల వాదనను మేఘాలయ పోలీసులు మరియు బీఎస్ఎఫ్ తోసిపుచ్చాయి. యూనస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారం అవాస్తవమని భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి. ఈ కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని భారత అధికారులు వెల్లడించారు.

సరిహద్దు దాటి ఎవరూ రాలేదని మరియు ఎవరినీ అరెస్టు చేయలేదని భారత భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్ పోలీసుల వాదనల్లో వాస్తవం లేదని, మేఘాలయ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ పరిణామం యూనస్ ప్రభుత్వ దర్యాప్తు తీరుపై పలు అనుమానాలకు దారితీస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *