భారత్ పై పాకిస్థాన్ యుద్ధ ప్రకటన ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు

భారత్ పై పాకిస్థాన్ యుద్ధ ప్రకటన ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మే నెలలో జరిగిన ఘర్షణల సమయంలో భారత దురాక్రమణకు పాకిస్థాన్ గట్టి సమాధానం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రదర్శించిన సంయమనానికి భారత్ కృతజ్ఞతతో ఉండాలని, తాము అనుకుంటే మరిన్ని భారత యుద్ధ విమానాలను కూల్చివేసేవారమని జర్దారీ సవాల్ విసిరారు.

యుద్ధాన్ని కోరుకోకపోయినా ఒకవేళ భారత్ మళ్ళీ యుద్ధాన్ని ప్రేరేపిస్తే తాము ధీటుగా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా ఉన్న ఈ ప్రకటన ఇప్పుడు రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. జర్దారీ చేసిన ఈ హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *