వైన్ తాగితే బరువు తగ్గుతారా? బీర్ మరియు ఇతర మద్యపానాలపై పరిశోధకుల కీలక వెల్లడి

వైన్ తాగితే బరువు తగ్గుతారా? బీర్ మరియు ఇతర మద్యపానాలపై పరిశోధకుల కీలక వెల్లడి

మద్యం సేవించడం వల్ల బరువు పెరుగుతారని అందరూ భావిస్తారు, కానీ ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 2,000 మందిపై చేసిన ఈ అధ్యయనంలో, రెడ్ మరియు వైట్ వైన్ తీసుకోవడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే ‘విసెల్ ఫ్యాట్’ తగ్గుతుందని తేలింది. కాలేయం, ప్యాంక్రియాస్ వంటి భాగాల వద్ద ఉండే ఈ మొండి కొవ్వును తగ్గించడంలో వైన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

అయితే, ఈ ప్రయోజనం కేవలం వైన్‌కు మాత్రమే పరిమితమని వారు స్పష్టం చేశారు. బీర్, వోడ్కా లేదా విస్కీ వంటి ఇతర పానీయాలు శరీరంలో కొవ్వును మరింత పెంచుతాయని పరిశోధనలో వెల్లడైంది. చర్మం కింద ఉండే కొవ్వు కంటే భిన్నమైన ఈ అంతర్గత కొవ్వును తగ్గించుకోవడానికి వైన్ ఉపయోగపడినప్పటికీ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పరిమితంగా తీసుకోవడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *