విపత్తు నిర్వహణ కోసం 20 రాష్ట్రాలకు 500 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం
December 17, 2025

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో 20 రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థల విపత్తు ముప్పు తగ్గించే చర్యల కోసం రూ. 507.37 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల స్థానిక సంస్థలు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ మరియు వనరులను పొందుతాయి.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన విపత్తు-నిరోధక భారత్ నిర్మాణంలో భాగంగా ఈ నిధులను కేటాయించారు. ఈ కార్యక్రమం కింద 81 విపత్తు ప్రభావిత జిల్లాలను ఎంపిక చేసి, పంచాయతీ స్థాయి నుంచి ప్రజలను చైతన్యపరచడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.