వరల్డ్ కప్ ఓటమి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న రోహిత్! నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఇదే!
December 22, 2025

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావించారు. ఎంతో శ్రమించినా లక్ష్యం నెరవేరకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ ఓటమి తనను మానసికంగా కుంగదీసిందని, కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టిందని రోహిత్ ఇటీవల గురుగ్రామ్‌లో వెల్లడించారు.
కానీ, రాబోయే టీ20 ప్రపంచకప్‌పై ఉన్న ఆశే ఆయనను మళ్లీ మైదానంలోకి రప్పించింది. ఆటపై ఉన్న మక్కువతో తన నిర్ణయాన్ని మార్చుకుని, పట్టుదలతో పోరాడి చివరికి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు.