వంటగదిలోని ఈ 5 పదార్థాలు గుండెపోటుకు కారణమవుతున్నాయా, వెంటనే వీటిని దూరం పెట్టండి

ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులు అకాల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయి. మనకు తెలియకుండానే వంటగదిలో వాడుతున్న కొన్ని ఆహార పదార్థాలు గుండె ధమనులలో కొవ్వును పేరుకుపోయేలా చేసి, గుండెను బలహీనపరుస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే సోడియం, నైట్రేట్లు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అలాగే డాల్డా, వనస్పతితో చేసిన వేపుళ్లు, ప్యాక్ చేసిన చిప్స్ వంటి పదార్థాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె బ్లాకేజీలకు దారితీస్తాయి.
శీతల పానీయాల్లో ఉండే అధిక చక్కెర, మైదాతో చేసిన పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి గుండె వాపునకు కారణమవుతాయి. వీటితో పాటు ఆహారంలో అధికంగా ఉప్పు వాడటం వల్ల రక్తపోటు పెరిగి, అది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం ఎర్ర మాంసానికి బదులుగా సముద్రపు చేపలు, పప్పు ధాన్యాలు మరియు ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే ఈ ‘సైలెంట్ కిల్లర్’ ఆహారాలను వెంటనే నియంత్రించడం ఎంతో అవసరం.