రూ. 10 వేలకే అమ్మకానికి అక్కాచెల్లెళ్లు! బయటపడ్డ దారుణమైన సెక్స్ రాకెట్
December 18, 2025

వైశాలికి చెందిన ఇద్దరు సోదరీమణులు ఇంటి నుండి పారిపోయి రైల్వే స్టేషన్కు చేరుకోగా, ఒక మహిళ వారిని మోసం చేసి మోతీహారికి తరలించి వ్యభిచార కూపంలోకి నెట్టింది. పెద్దమ్మాయిని కేవలం 10 వేల రూపాయలకే దళారులు పలుమార్లు విక్రయించగా, చివరకు ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి పెళ్లి చేసుకుని విందు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి రక్షించారు.
పోలీసులు జరిపిన మరో దాడిలో చిన్నమ్మాయి కూడా సురక్షితంగా బయటపడింది. ఈ ఉదంతంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్పై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.