రిటైర్మెంట్ ముందు తీర్పుల వర్షం కురిపిస్తున్నారా అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

రిటైర్మెంట్ ముందు తీర్పుల వర్షం కురిపిస్తున్నారా అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

పదవీ విరమణకు ముందు వరుసగా తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక జిల్లా సెషన్స్ జడ్జి కేసును ప్రస్తావిస్తూ, ఇది క్రికెట్ మ్యాచ్ చివరి ఓవర్‌లో సిక్సర్లు కొట్టే ప్రయత్నంలా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి ధోరణి న్యాయ వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.

వివాదాస్పద తీర్పుల కారణంగా సదరు జడ్జి రిటైర్మెంట్ కావడానికి కేవలం 10 రోజుల ముందు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. వెంటనే హైకోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ, ఆ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి న్యాయ పోరాటం కోసం ఆయనకు వెసులుబాటు కల్పించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *