ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలనం ఆత్మాహుతి బాంబర్ యాసిర్ అహ్మద్ దార్ అరెస్ట్

ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలనం ఆత్మాహుతి బాంబర్ యాసిర్ అహ్మద్ దార్ అరెస్ట్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీ విజయం సాధించింది. ఈ కేసులో తొమ్మిదో నిందితుడైన యాసిర్ అహ్మద్ దార్‌ను అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌కు చెందిన యాసిర్, దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడికి పాల్పడతానని ప్రతిజ్ఞ చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. నవంబర్ 10న జరిగిన పేలుడు వెనుక ఉన్న కుట్రలో ఇతనికి కీలక పాత్ర ఉందని, ప్రధాన నిందితులైన ఉమర్ నబీ, ముఫ్తీ ఇర్ఫాన్‌లతో ఇతను నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

యూఏపీఏ (UAPA) చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద యాసిర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాద కుట్రను ఛేదించే క్రమంలో జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. మరో నిందితుడు నాసిర్ బిలాల్ మల్లా వాయిస్ శాంపిల్స్ పరీక్షించేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులందరినీ పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *