రాహుల్ గాంధీ ఎంపీ పదవిని రద్దు చేయాలని నిషికాంత్ దూబే సంచలన డిమాండ్
February 13, 2026

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నోటీసు ఇచ్చారు. సోరోస్ మరియు ఫోర్డ్ ఫౌండేషన్ వంటి భారత్ వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కును శాశ్వతంగా తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ పరిణామంపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ బీజేపీ చర్యలు రాహుల్‌పై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొన్నారు. గతంలో మహువా మోయిత్రా ఎంపీ పదవి రద్దు విషయంలో కూడా నిషికాంత్ దూబే కీలక పాత్ర పోషించడం గమనార్హం.