ధోనీ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
February 13, 2026

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో అర్ధశతకం సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా నిలిచి, గతంలో ధోనీ పేరిట ఉన్న 45 పరుగుల రికార్డును అధిగమించాడు. 24 బంతుల్లో 64 పరుగులు చేసిన ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 93 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రోహిత్, రాహుల్ సరసన నిలిచాడు. యువరాజ్ సింగ్ తర్వాత టీమిండియా తరపున అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషన్ సంయుక్తంగా మూడవ స్థానానికి చేరుకున్నాడు.