యువతి ప్రాణాల కోసం తన టాక్సీని అమ్మేసిన డ్రైవర్ కోలుకున్నాక ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ రాజ్‌వీర్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడి ఉన్న ఆసిమా అనే యువతిని చూసి ఎవరూ ముందుకు రాకపోయినా, రాజ్‌వీర్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కోసం అత్యవసరంగా రెండు లక్షల రూపాయలు అవసరం పడటంతో, తన కుటుంబానికి జీవనాధారమైన కొత్త టాక్సీని వెంటనే అమ్మేసి ఆమె ప్రాణాలను కాపాడారు.
ఆసిమా కోలుకున్నాక తన కాన్వోకేషన్ వేడుకకు రాజ్‌వీర్‌ను సాదరంగా ఆహ్వానించింది. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకున్న ఆమె, ఆ గౌరవం తన ప్రాణాలు కాపాడిన అన్న రాజ్‌వీర్‌కే దక్కుతుందని వేదికపై ప్రకటించి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. కృతజ్ఞతగా రాజ్‌వీర్‌కు కొత్త టాక్సీని బహుమతిగా ఇవ్వడమే కాకుండా, అతని కుటుంబానికి అండగా నిలిచింది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలనే సందేశాన్ని ఈ ఘటన చాటిచెబుతోంది.