మేము ప్రపంచ దేశాల దగ్గర అడుక్కుంటున్నాం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

మేము ప్రపంచ దేశాల దగ్గర అడుక్కుంటున్నాం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌లో జరిగిన ఎగుమతిదారుల సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఆదుకోవడానికి తాను, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కలిసి ప్రపంచ దేశాల వద్ద ‘అడుక్కుంటున్నామని’ ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఈ పరిస్థితి దేశ గౌరవానికి విరుద్ధమని, అప్పుల కోసం విదేశాల చుట్టూ తిరగడం తనకు ఎంతో ‘సిగ్గుచేటు’గా అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఈ విదేశీ పర్యటనల వల్ల పాకిస్థాన్‌కు మేలు జరిగిందని, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయని షరీఫ్ పేర్కొన్నారు. కేవలం అప్పులపైనే ఆధారపడటం వల్ల ఇతర దేశాలు విధించే అనవసర నిబంధనలకు తలొగ్గాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. దేశం ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *