మేనల్లుడితో అత్త పెళ్లి, భర్తకు ఫోటో పంపి షాక్ ఇచ్చిన భార్య

మేనల్లుడితో అత్త పెళ్లి, భర్తకు ఫోటో పంపి షాక్ ఇచ్చిన భార్య

బీహార్‌లోని బాంకా జిల్లాలో ఒక మహిళ తన సొంత మేనల్లుడిని వివాహం చేసుకున్న వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అమర్‌పూర్ ప్రాంతానికి చెందిన పూనమ్ కుమారి తన ఇద్దరు పిల్లలతో కలిసి అకస్మాత్తుగా ఇంటి నుండి వెళ్ళిపోయింది. భర్త శివం కుమార్ ఆమె కోసం వెతుకుతుండగా, ఆమె తన మేనల్లుడు అంకిత్ కుమార్‌ను గుడిలో పెళ్లి చేసుకున్న ఫోటోను భర్త మొబైల్‌కు పంపడంతో అందరూ విస్తుపోయారు.

భార్య చేసిన పనికి షాక్ తిన్న శివం కుమార్ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తన పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ మరియు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరియు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *