మెస్సీ ఒక్క కాలి విలువతో ఏకంగా ఒక దేశాన్నే కొనవచ్చు విస్తుపోయేలా చేస్తున్న ఇన్సూరెన్స్ వివరాలు
December 17, 2025

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలో సందడి చేశారు. జై షా అతనికి భారత క్రికెట్ జట్టు సంతకం చేసిన బ్యాట్‌ను బహుకరించారు. అయితే, మెస్సీ ఎడమ కాలి ఇన్సూరెన్స్ విలువ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మెస్సీ తన ఎడమ కాలికి ఏకంగా 900 మిలియన్ డాలర్లు అంటే సుమారు 74 వందల కోట్ల రూపాయల బీమా చేయించారు.
ఈ భారీ బీమా నిబంధనల వల్లే మెస్సీ ప్రదర్శన మ్యాచ్‌ల్లో ఆడటానికి విముఖత చూపుతారు. మెస్సీ ఒక్క కాలి విలువ పలావు మరియు తువాలు వంటి చిన్న దేశాల మొత్తం జిడిపి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.