దుబాయ్ షిప్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న అనురాగ్ ద్వివేది నివాసంలో ఈడీ సోదాలు
December 17, 2025

ఉన్నావ్‌కు చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్రమోటర్ అనురాగ్ ద్వివేది నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఇటీవల దుబాయ్‌లో ఒక క్రూయిజ్ షిప్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్న అనురాగ్, తన గ్రామానికి చెందిన 20 మందిని సొంత ఖర్చుతో అక్కడికి తీసుకెళ్లడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్ ద్వారా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో బుధవారం ఉదయం ఈడీ బృందం సోదాలు చేపట్టింది. సుమారు 16 మంది అధికారుల బృందం పలు కీలక పత్రాలను పరిశీలించింది. అయితే, దాడుల సమయంలో అనురాగ్ ఇంట్లో లేనట్లు సమాచారం.