మెస్సీకి అనంత అంబానీ కోట్లాది రూపాయల ఖరీదైన వాచ్ గిఫ్ట్
December 17, 2025

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న అనంత్ అంబానీకి చెందిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ‘వంతారా’ను సందర్శించారు. అక్కడ వన్యప్రాణులతో సరదాగా గడిపిన మెస్సీకి అనంత్ అంబానీ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ సుమారు 10.91 కోట్ల రూపాయల విలువైన అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లె వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రపంచంలో కేవలం 12 మాత్రమే ఉన్న ఈ ఖరీదైన గడియారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.