బుర్కా వేసుకోలేదని ఘోరం భార్య మరియు ఇద్దరు కూతుళ్లను చంపిన కిరాతకుడు

బుర్కా వేసుకోలేదని ఘోరం భార్య మరియు ఇద్దరు కూతుళ్లను చంపిన కిరాతకుడు

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో బుర్కా ధరించలేదనే కోపంతో ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు మైనర్ కుమార్తెలను దారుణంగా హత్య చేశాడు. నిందితుడు ఫారూఖ్ ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాలను ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు.

పది రోజుల నుంచి వారు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ఫారూఖ్ తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మృతదేహాలను వెలికితీశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *