ముంబైలో డెలివరీ బాయ్ ముసుగులో ఘాతుకం, విద్యార్థిని గొంతు నులిమి హత్యాయత్నం
January 2, 2026

ముంబైలోని అంధేరీలో డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన ఒక దుండగుడు ఎంఎస్సీ విద్యార్థినిపై కిరాతక దాడికి పాల్పడ్డాడు. మరోల్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి పార్శిల్ పేరుతో వచ్చిన నిందితుడు, కత్తితో బెదిరించి నగదు దోచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించగా, అరుపులు విని పొరుగువారు రావడంతో నిందితుడు పారిపోయాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితుడు తన ముఖాన్ని ఒక పేపర్ ఫోల్డర్‌తో దాచుకున్నాడని, అతని వయస్సు 20 నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎంఐడిసి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రజలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.