మీరు తినేది అసలు బియ్యమేనా లేక ప్రాణాంతక ప్లాస్టిక్ బియ్యమా ఇలా గుర్తించండి
February 13, 2026

ప్రస్తుతం మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం కల్తీ పెరిగిపోతోంది ఇది క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు కొనుగోలు చేసిన బియ్యం అసలైనవో కాదో ఇంట్లోనే కొన్ని చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. బియ్యాన్ని నీళ్లలో వేసినప్పుడు అవి అడుగుకు చేరకుండా పైకి తేలితే అవి నకిలీ బియ్యంగా గుర్తించాలి.
బియ్యం గింజలను మంటపై ఉంచినప్పుడు ప్లాస్టిక్ వాసన వచ్చినా లేదా మరిగే నూనెలో వేసినప్పుడు కరిగి ముద్దగా మారినా అవి ప్లాస్టిక్ బియ్యమే. వండిన అన్నం రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉంటే అది కచ్చితంగా కల్తీ అని గమనించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి బియ్యం కొనేటప్పుడు జాగ్రత్త వహించండి.