మతం మారినా కులం మారదు పెళ్లయిన తర్వాత కూడా పుట్టిన గుర్తింపే శాశ్వతమని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

మతం మారినా కులం మారదు పెళ్లయిన తర్వాత కూడా పుట్టిన గుర్తింపే శాశ్వతమని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

మతం మారడం వల్ల లేదా వివాహం చేసుకోవడం వల్ల ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చే కుల గుర్తింపు ఏమాత్రం మారదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మతం అనేది మార్చుకోగలిగేది కానీ కులం అనేది ఎప్పటికీ మారదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత కూడా ఒక మహిళ యొక్క కుల గుర్తింపు అలాగే ఉంటుందని దీనివల్ల ఆమెకు లభించే చట్టపరమైన రక్షణలు కొనసాగుతాయని న్యాయస్థానం పేర్కొంది.

అలీగఢ్‌కు చెందిన ఒక క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకున్నంత మాత్రాన ఆమెపై జరిగిన కుల వివక్ష కేసు వీగిపోదని కోర్టు తేల్చి చెప్పింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కుల గుర్తింపు అనేది మారదు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *