మీరట్‌లో రంజాన్ వేళ పెను విషాదం భారీ అగ్నిప్రమాదంలో కవల పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

మీరట్‌లో రంజాన్ వేళ పెను విషాదం భారీ అగ్నిప్రమాదంలో కవల పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని లిసారీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరు నెలల వయసున్న కవల ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నిల్వ ఉంచిన బట్టల గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా విస్తరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

జనావాసాల మధ్య సన్నని వీధులు ఉండటంతో ఫైర్ ఇంజన్లు చేరుకోవడం కష్టతరమైంది. పొరుగువారు నిచ్చెనల సాయంతో ఆరుగురిని రక్షించినప్పటికీ, లోపల చిక్కుకున్న ఐదుగురు పిల్లలను కాపాడలేకపోయారు. ఆసుపత్రికి తరలించే లోపే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గ్యాస్ లీకేజీ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *