భార్యతో సొంత మేనల్లుడి వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు దారితీసిన విషాదం

భార్యతో సొంత మేనల్లుడి వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు దారితీసిన విషాదం

గుజరాత్‌లోని రాజ్‌కోట్ నాగేశ్వర్ ప్రాంతంలో అక్రమ సంబంధం కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. లాల్జీ అనే వ్యక్తి తన భార్య త్రిష మరియు తన స్వంత మేనల్లుడు విశాల్‌ను అభ్యంతరకర స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. ఈ వివాదం తర్వాత భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయి తన స్నేహితురాలితో కలిసి జీవించడం మొదలుపెట్టింది.

లాల్జీ తన ఆస్తి మొత్తాన్ని భార్య పేరిట రాసి ఇచ్చి మళ్లీ కలిసి ఉండాలని ప్రయత్నించాడు. అయితే మేనల్లుడు మరియు స్నేహితురాలి మాటలు విని ఆమె తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన లాల్జీ తన భార్యపై కాల్పులు జరిపి, ఆపై తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *