భారత జట్టుకు షమీ లేని లోటు కనిపిస్తోంది మాజీ క్రికెటర్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు

జాతీయ జట్టులో మహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ పెదవి విప్పారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో యువ పేసర్లకు సలహా ఇవ్వడానికి ఒక సీనియర్ బౌలర్ లేని లోటు జట్టులో కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో, భారత బౌలర్లు మంచి ప్రారంభం చేసినప్పటికీ, మార్కో జేన్సన్, మాథ్యూ బ్రీట్జ్‌కేల పోరాటం ముందు చివరి నిమిషంలో విజయం సాధించగలిగారు.
జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో, ఈ సిరీస్‌కు షమీ లాంటి సీనియర్ బౌలర్ ఉండటం చాలా అవసరమని కైఫ్ నొక్కి చెప్పారు. రంజీ ట్రోఫీలో 145.2 ఓవర్లు బౌలింగ్ చేసి 20 వికెట్లు తీసిన షమీ, ఏ పిచ్‌పైనైనా వికెట్లు తీయగల సామర్థ్యం కలవాడు. షమీ జట్టులో ఉంటే, ప్రసిధ్, అర్ష్‌దీప్, హర్షిత్ వంటి యువ బౌలర్లకు ఒత్తిడి సమయంలో అనుభవం తోడై ఉండేదని కైఫ్ అభిప్రాయపడ్డారు.