న్యాయవాదులు నల్ల కోట్ ఎందుకు వేసుకుంటారు? దీని వెనుక ఉన్న ఆసక్తికర రహస్యం!

న్యాయవాద వృత్తిలో నల్ల కోటు ధరించడం అనేది చాలా కాలంగా ఉన్న ఆచారం. ఈ దుస్తులు న్యాయవాదులకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే కాకుండా, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశంలో, 1961 నాటి అడ్వకేట్స్ చట్టం ప్రకారం న్యాయవాదులు నల్ల కోటు ధరించడం తప్పనిసరి చేశారు. నలుపు రంగు శక్తి, అధికారం, విధేయతకు సంకేతంగా భావిస్తారు, ఇది న్యాయవాదులు న్యాయానికి కట్టుబడి ఉంటారనడానికి నిదర్శనం.
నల్ల కోటు ప్రాముఖ్యత కేవలం సంప్రదాయానికే పరిమితం కాదు, దీని వెనుక చారిత్రక, ఆచరణాత్మక కారణాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో కింగ్ చార్లెస్ మరణించినప్పుడు, సంతాప సూచకంగా న్యాయవాదులు నల్ల దుస్తులు ధరించడంతో ఈ ఆచారం మొదలైంది. అంతేకాకుండా, నలుపు రంగును దృష్టి లోపానికి సంకేతంగా కూడా చూస్తారు—న్యాయం అంధంగా (పక్షపాతం లేకుండా) ఉంటుందనే భావన దీనికి మూలం. న్యాయవాదులు చొక్కాపై ధరించే తెలుపు బ్యాండ్ పవిత్రత మరియు నిష్కపటత్వానికి చిహ్నం. ఈ దుస్తులు న్యాయం, సత్యం పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తుంది.