భారత చట్టాలు వర్తించని హిమాచల్ మర్మ గ్రామం నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా తప్పదు

భారత చట్టాలు వర్తించని హిమాచల్ మర్మ గ్రామం నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా తప్పదు

హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతీ వ్యాలీలో 10,000 అడుగుల ఎత్తులో ఉన్న మలానా గ్రామం వింత ఆచారాలకు నిలయం. తమను తాము అలెగ్జాండర్ సైనికుల వంశస్థులుగా చెప్పుకునే ఇక్కడి ప్రజలు భారత రాజ్యాంగాన్ని లేదా పోలీసు వ్యవస్థను అస్సలు నమ్మరు. వీరికి 11 మంది సభ్యులతో కూడిన సొంత పార్లమెంటు ఉంటుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే ‘జమఘాట్’ దేవత పేరు మీద వింత పద్ధతుల్లో తీర్పులు చెబుతారు. నేర నిరూపణ కోసం గొర్రెలకు విషం ఇచ్చి పరీక్షించే ప్రాచీన సంప్రదాయం ఇక్కడ నేటికీ కొనసాగుతోంది.

ఈ గ్రామంలో బయటి వ్యక్తులు స్థానికులను లేదా వారి ఇళ్లను తాకడం నిషిద్ధం. పొరపాటున ఎవరైనా ముట్టుకుంటే 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దుకాణాల్లో వస్తువులను నేరుగా చేతికి ఇవ్వకుండా నేలపై పెడతారు. తమను తాము పవిత్రమైన జాతిగా భావించే వీరు రాత్రి 8 గంటల తర్వాత బయట తిరగడాన్ని నిషేధించారు. మహిళలకు ఓటు హక్కు లేని ఈ గ్రామంలో కనీస మొబైల్ సిగ్నల్స్ కూడా అందుబాటులో ఉండవు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *