భారత్‌కు చుక్కలు చూపించిన పాక్ బ్యాటర్.. 348 పరుగుల లక్ష్య ఛేదనలో కుప్పకూలిన టాపార్డర్!

భారత్‌కు చుక్కలు చూపించిన పాక్ బ్యాటర్.. 348 పరుగుల లక్ష్య ఛేదనలో కుప్పకూలిన టాపార్డర్!

అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కష్టాల్లో పడింది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, 172 పరుగులతో రికార్డు సృష్టించాడు. భారత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడచడంతో పాక్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ మూడు వికెట్లు పడగొట్టి పాక్ పరుగుల వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విఫలం కావడంతో భారత్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొమ్మిదోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్న భారత్‌కు ఈ లక్ష్యం సవాల్‌గా మారింది. 2012 తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడాలని పాకిస్థాన్ గట్టి ప్రయత్నం చేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *