బెంగళూరు హైవేపై ఎస్‌యూవీ మరియు ట్రక్కు మధ్య భీకర ప్రమాదం ఏడుగురు మృతి
February 13, 2026

బెంగళూరు హోస్కోటే-దేవస్పేట్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన ఎస్‌యూవీ కారు ముందున్న బైక్‌ను ఢీకొట్టి ఆపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొనడంతో కారులోని ఆరుగురు ప్రయాణికులతో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించారు.
ఎం సత్యవర గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదానికి మితిమీరిన వేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు కొత్తనూరు ప్రాంతానికి చెందిన వారని సమాచారం. బెంగళూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.