బాల్క సుమన్ అరెస్ట్‌తో వేడెక్కిన రాజకీయం.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్

బాల్క సుమన్ అరెస్ట్‌తో వేడెక్కిన రాజకీయం.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం – కేటీఆర్ హెచ్చరిక

క్యాతనపల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకునేందుకే ఈ అక్రమ అరెస్టులకు తెరలేపారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రేవంత్ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. పోలీసు అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ మార్కు గూండాగిరి – హరీశ్‌రావు ఆగ్రహం

బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోందని, హంగ్ వచ్చిన ప్రతిచోటా అడ్డదారుల్లో పీఠాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *