బహుశా ప్రపంచంలోనే మొదటిసారి బెర్ముడా ట్రయాంగిల్ కింద దాగున్న ఆ రహస్యం ఇదే
December 16, 2025

బెర్ముడా దీవుల కింద సుమారు 20 కిలోమీటర్ల మందపాటి వింతైన రాతి పొరను శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా అగ్నిపర్వతాలు చల్లబడిన తర్వాత దీవులు సముద్రంలో మునిగిపోతాయి, కానీ ఈ ప్రత్యేకమైన పొర బెర్ముడాను 3 కోట్ల ఏళ్లుగా సముద్ర మట్టానికి పైనే ఉంచుతోంది. భూమి లోపలి పొరల్లో జరిగిన ఈ అరుదైన మార్పు ప్రపంచంలో మరెక్కడా కనిపించకపోవడం గమనార్హం.
శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఈ రాతి పొర ఒక ‘రాఫ్ట్’ లాగా పనిచేస్తూ దీవిని నీటిపై తేలేలా చేస్తోంది. విమానాలు, ఓడలు అదృశ్యం కావడం వెనుక ఉన్న పుకార్ల కంటే, ఈ 20 కిలోమీటర్ల మందపాటి శిలయే అసలైన భౌగోళిక రహస్యం అని పరిశోధకులు భావిస్తున్నారు. భూకంప తరంగాల సాయంతో జరిపిన ఈ అధ్యయనం ద్వారా సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ వింతైన నిర్మాణం వెలుగులోకి వచ్చింది.