పుతిన్ భారత పర్యటన: మోడీ డిన్నర్‌లో చేప ఉంటుందా? రష్యా అధ్యక్షుడి ఫుడ్ సీక్రెట్ ఏమిటి

పుతిన్ భారత పర్యటన: మోడీ డిన్నర్‌లో చేప ఉంటుందా? రష్యా అధ్యక్షుడి ఫుడ్ సీక్రెట్ ఏమిటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనలో సైనిక, వ్యూహాత్మక చర్చలతో పాటు, ఆయన ఆహారపు అలవాట్లపైనా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌కు వస్తున్న పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 4 రాత్రి పుతిన్ భారత్‌లోనే విందు భోజనం చేస్తారని తెలిసింది. భద్రతా కారణాల వల్ల మెనూ గోప్యంగా ఉన్నప్పటికీ, ఆయన ఆహారపు అలవాట్ల దృష్ట్యా ఈ డిన్నర్‌లో చేపల వంటకాలు ఉండే అవకాశం బలంగా ఉంది.

వ్యక్తిగత జీవితంలో పుతిన్ ఆరోగ్యకరమైన, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. సాంప్రదాయ రష్యన్ అల్పాహారంలో, ఆయన సాధారణంగా తేనెతో కూడిన గంజి లేదా ‘ట్వోరోగ్’ (రష్యన్ కాటేజ్ చీజ్) తీసుకుంటారు. అయితే, నిమ్మకాయ-వెన్నతో కూడిన స్మోక్డ్ స్టర్జియన్ ఫిష్, గొర్రె మాంసం (Lamb) ఆయనకు చాలా ఇష్టమైన వంటకాలు. ఆయన సాధారణంగా స్వీట్లు, కొవ్వు పదార్థాలను దూరం పెడతారు. పుతిన్ క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు ఆయన ఆరోగ్య స్పృహతో కూడిన జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *