పాలు మరియు పనీర్లో కల్తీ చేస్తే జైలుకే దేశవ్యాప్తంగా భారీ తనిఖీలకు FSSAI ఆదేశం
December 17, 2025

పాలు, పనీర్ మరియు కోవాలో పెరుగుతున్న కల్తీని అరికట్టడానికి భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) దేశవ్యాప్త తనిఖీలకు ఆదేశించింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ తయారీ కేంద్రాలు మరియు లైసెన్స్ లేని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అధికారులు నమూనాలను సేకరించి నాణ్యతను పరీక్షిస్తారు. కల్తీ నిర్ధారణ అయితే లైసెన్సుల రద్దుతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. వినియోగదారుల నమ్మకాన్ని కాపాడేందుకు ఈ తనిఖీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు.