కాలుష్య కోరల్లో ఊపిరితిత్తులు రోజుకు 20 సిగరెట్లు తాగినంత ప్రమాదం
December 17, 2025

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపిరితిత్తులను కోవిడ్ తరహాలో దెబ్బతీస్తోంది. గాలిలోని పీఎం 2.5 కణాలు నేరుగా రక్తంలోకి చేరి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని డాక్టర్ సందీప్ శర్మ తెలిపారు. 300 ఏక్యూఐ స్థాయిలో శ్వాస తీసుకోవడం అంటే రోజుకు దాదాపు 20 సిగరెట్లు తాగడంతో సమానమని ఆయన హెచ్చరించారు.
దీనివల్ల ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 2025 నాటికి భారతదేశంలో ఈ కేసుల సంఖ్య 81,200కి చేరుకోవచ్చని అంచనా. కాలుష్యం కారణంగా ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.