పాడైన కిడ్నీలకు పునర్జన్మ శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన సక్సెస్
December 17, 2025

యూనివర్శిటీ ఆఫ్ యూటా హెల్త్ శాస్త్రవేత్తలు కిడ్నీ వ్యాధుల చికిత్సలో కీలక మైలురాయిని అధిగమించారు. శరీరంలోని ‘సెరామైడ్’ అనే ఫ్యాట్ కణాలు కిడ్నీ కణజాలాన్ని దెబ్బతీస్తాయని గుర్తించిన పరిశోధకులు, ఒక ప్రత్యేక ఔషధం ద్వారా ఎలుకలలో పాడైన కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చగలిగారు. ఈ మందు కిడ్నీలోని మైటోకాండ్రియాను పునరుద్ధరించి, కణాలకు తిరిగి శక్తిని అందించడంలో విజయవంతమైంది.
ఈ సాంకేతికత భవిష్యత్తులో డయాలసిస్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, మానవులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే కిడ్నీ రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కిడ్నీలు దెబ్బతిన్న వారికి ఈ పరిశోధన కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.