పాక్ మ్యాచ్‌పై సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు! అభిమానుల్లో ఉత్కంఠ
September 20, 2025

ఆసియా కప్ 2025 లో ఒమన్‌పై విజయం సాధించి, గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు సూపర్ 4కు చేరుకుంది. ఈ విజయం తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆదివారం నాడు పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ గురించి అడగగా, ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా సూటిగా స్పందించారు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌పై సన్నాహాల గురించి అడగగా, “సూపర్ 4 కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం” అని మాత్రమే బదులిచ్చారు.
సూర్యకుమార్ వ్యాఖ్యలు అంతకుముందు జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయని సంఘటనల నేపథ్యంలో వచ్చాయి, అది తీవ్ర వివాదాన్ని సృష్టించింది. యాదవ్ తాజా వ్యాఖ్యలు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ సూపర్ 4 మ్యాచ్‌పై ఉత్కంఠను మరింత పెంచాయి.