డిజిటల్ అరెస్ట్తో డాక్టర్ మృతి, చనిపోయిన తర్వాత కూడా వచ్చాయి బెదిరింపు మెసేజ్లు

డిజిటల్ అరెస్ట్తో డాక్టర్ మృతి, చనిపోయిన తర్వాత కూడా వచ్చాయి బెదిరింపు మెసేజ్లు

హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్కు గురైన ఒక రిటైర్డ్ ప్రభుత్వ వైద్యురాలు తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయారు. సైబర్ నేరగాళ్లు ఆమెను మూడు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచి, బ్యాంకు ఖాతా నుండి దాదాపు ₹6.6 లక్షలను మోసగించారు. ఈ మోసం వల్ల కలిగిన మానసిక ఒత్తిడి కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధితురాలు చనిపోయిన తర్వాత కూడా మోసగాళ్ల నుండి ఆమె ఫోన్‌కు బెదిరింపు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *